నేడే చంద్రయాన్-3 ప్రయోగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. చంద్రయాన్‌ -3 శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్నది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో సర్వం సిద్ధమైంది.

Leave A Reply

Your email address will not be published.