156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడిక‌ల్ హెల్త్ స‌ర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ, ఆయూష్ విభాగంలో 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడిక‌ల్ హెల్త్ స‌ర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 మొత్తం 156 మంది మెడికల్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు ఆగస్టు 7వ తేదీ నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దరఖాస్తుల ప్రక్రియ, పూర్తి వివరాల కోసం mhsrb.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ కావొచ్చ‌ని బోర్డు సూచించింది.

Leave A Reply

Your email address will not be published.