సంస్కృతి, సంప్రదాయాన్ని విలువలను ప్రతిబింబింప చేసేదే మాతృభాష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లాలోని కోదాడ నియోజకవర్గ పరిధి నడిగూడెం ఘడిలో జరిగిన దివంగత కొమర్రాజు వెంకట లక్ష్మణ్ రావు శత వర్ధంతి వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి , సహచర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాన్ని విలువలను ప్రతిబింబింప చేసేదే మాతృభాష అని ఆయన అభివర్ణించారు. అలాంటి మాతృభాషపై మమకారం పెంపొందించుకోవడంతో పాటు పట్టు సాధించే దిశగా నిరంతర ప్రయత్నం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మాతృ భాష పరిరక్షణకు పాటు పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మ మీద ఉన్నంత ప్రేమ మాతృభాష మీద ఉండాలని ఆయన కోరారు. సృష్టిలో ప్రాణి జీవనానినికి అమ్మ ఎంతటి అవసరమో, అదే ప్రాణి జీవితంలో మనుగడ సాధించడానికి భాష అంతటి అవసరంగా గుర్తించ గలిగిన రోజునే మాతృభాష కాపడబడుతుందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో భాష దూరభిమానం ఎంతమాత్రం కాకూడదని మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు.అదే సమయంలో మాతృభాష దూరభిమానం కాకూడదనిచెప్పారు. రోజు రోజుకు పరాయి బాష మీద పెరుగుతున్న మోజును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన సుస్పష్టంగా వెల్లడించారు. అయితే అవసరం కోసం పరాయి భాషను నేర్చుకోవడాన్ని తప్పు పట్టడం లేదన్నారు.ఎలాంటి పరిస్థితులలో ఉత్పత్తుల భాషను ఇతర భాషల్లోకి తర్జుమా చేయలేమన్న వాస్తవాన్ని గుర్తించగలిగితే మాతృభాషకు ఉన్న ప్రాముఖ్యత ఇట్టే తెలిసి పోతుందన్నారు.అలాంటి ప్రయత్నం 100 ఏండ్ల కిందటే కొమర్రాజు వెంకట లక్ష్మణ్ రావు లాంటి ఉద్దండులు మొదలు పెట్టారని, మాతృభాష పటిష్ఠతకు పునాదులు వేసిన దివంగత కొమర్రాజు లక్ష్మణ్ రావు తెలుగు భాషా వైతాళికుడు అని ఆయన కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.