104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే

- సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్‌లో ఓడిపోతారు - అందుకే నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారు - సర్వే రిపోర్టు సంచలన విషయాన్ని బయట పెట్టిన  రేవంత్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ తన నివాసంలో మీడియా మీట్ ఏర్పాటు చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పవర్’ పాలిటిక్స్ నడుస్తున్న ఈ నేపథ్యంలో సంచలన సర్వేను రేవంత్ బయటపెట్టారు. ఆయన చెప్పిన ఈ సర్వే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్థిప్రతిపక్షం అని ఆ పార్టీ చేపట్టిన నిరసనలుధర్నాలతో తేలిపోయిందని మరోసారి రేవంత్ స్పష్టం చేశారు. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే రిపోర్టులో తేలిందని రేవంత్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. గులాబీ బాస్సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్‌లో ఓడిపోతారని సర్వేల్లో తేలిందని రేవంత్ చెప్పుకొచ్చారు. అందుకే కేసీఆర్ పక్క నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్‌లో ఇప్పుడున్న సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదు..అని రేవంత్ ప్రశ్నించారు. మగాళ్లు అయితే సిట్టింగ్‌లకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని లేకుంటే మాడా అని ఒప్పుకోవాలని ఒకింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం సభతోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందని రేవంత్ మరోసారి గుర్తు చేశారు. తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ అని యువనేత రాహుల్ గాంధీ ప్రకటించారన్న విషయాన్ని ఈ మీడియా మీట్ వేదికగా చెప్పుకొచ్చారు. అయితే.. ఈ సర్వే బీఆర్ఎస్ చేయించగా లీక్ అయ్యిందా లేకుంటే కాంగ్రెస్ చేయించిందా అనే తెలియట్లేదు. ప్రస్తుతం రేవంత్ చేసిన కామెంట్స్ మాత్రం అటు తెలంగాణ రాజకీయాల్లో ఇటు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి.

 

గతంలో ఇలా సీట్లుఓటింగ్ శాతం

కాగా.. జూన్-17న కూడా రేవంత్‌ ఓ సర్వేని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మునుపటితో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందని రేవంత్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ 21 శాతం నుంచి దాదాపు 07శాతం వరకు పడిపోయిందన్నారు. బీఆర్ఎస్‌కు 45 స్థానాలు, 37 శాతం ఓట్లు.. కాంగ్రెస్‌‌కు 45 స్థానాలు, 35 శాతం ఓట్లు.. బీజేపీకి 07 స్థానాలు, 14 శాతం ఓట్లు.. ఎంఐఎంకు 07 సీట్లు వస్తాయని 03 శాతం ఓట్లు పడతాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. 15 సీట్లలో ప్రత్యర్థితో కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఉంటుందని రేవంత్‌ జోస్యం చెప్పారు. అయితే అప్పటికీ ఇప్పటికే రేవంత్ బయటపెట్టిన సర్వేలో చాలా తేడాలున్నాయి. అంటే కాంగ్రెస్ ఊహించని రీతిలో బలపడుతోందని.. రేవంత్ తాజా సర్వేని బట్టి చూస్తే అర్థమవుతోంది.

 

పవర్ పాలిటిక్స్‌పై ఇలా..

అవును.. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చుకున్నారు. 24 గంటల కరెంట్ కోసం పాదయాత్ర సమయంలో ఖమ్మంలో ధర్నా చేసినట్లు రేవంత్ చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్ ముసుగులో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. ప్రజలకు భారంగా ఉన్న కేసీఆర్‌‌‌ సర్కార్‌ను కచ్చితంగా రద్దు చేస్తాం. ఉచిత విద్యుత్‌పై మా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వానికి సవాలు విసిరారు.. ఈరోజు ఆ విషయాన్ని నిరూపించి చూపించారు కూడా. అదే విధంగా.. జీవన్ రెడ్డికోమటిరెడ్డి విసిరిన సవాలు స్వీకరించే దమ్ము మంత్రులు కేటీఆర్హరీష్‌లకు ఉందా?. అన్ని సబ్ స్టేషన్ల లాక్ బుక్కులు సరెండర్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారట. కరీంనగర్ మంత్రి గుమ్మికింద పందికొక్కు నన్ను ఊరి తీస్తా అన్నాడు. బీఆర్ఎస్ నాయకులను బట్టలిప్పి పొలాల్లో ఉరికిస్తే రైతుల బాధలు తెలుస్తాయి. కేసీఆర్ చంద్రబాబు చెప్పులు మోశారు. నేను చంద్రబాబుతో కలిసి పని చేశాను. కేటీఆర్ వస్తే వ్యవసాయంలో ఇద్దరం పోటీ పడుడాం. నేను వ్యవసాయం తెలిసిన వాడిని. దుక్కి దున్నిన వాడిని. కేటీఆర్‌లాగా అమెరికాలో నేను బాత్ రూంలు కడగలేదు. నేను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకుని కాదు.. నేను దళారీ కొడుకును కాదు’ అని బీఆర్ఎస్‌పై రేవంత్ నిప్పులు చెరిగారు.

 

మాట నిలబెట్టుకుంటాం..!

‘ బీజేపీ- బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం. నేనుకోమటిరెడ్డిషబ్బీర్ అలీ వస్తాం. ఏ సబ్ స్టేషన్ దగ్గరుండాలి.. ఎప్పుడు రమ్మంటారు..?. మా సవాలును కేటీఆర్ స్వీకరిస్తారాహరీష్ స్వీకరిస్తారా?. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైంది. ధర్మపురి అరవింద్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. ధర్మపురి అరవింద్‌ని కూడా సీరియస్‌గా తీసుకుంటారా?. 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్.. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒకటో తారీఖున జీతం ఇస్తాం. ప్రభుత్వం మూడు పంటలు ఇవ్వలేదు.. మూడు గింజలు కొనలేదు. నీచుడు అనే పదానికి నిలువుటద్దం కేసీఆర్.. విద్యుత్ అంశంపై 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారో లేదో కిషన్ రెడ్డిలక్ష్మన్ ఎందుకు మాట్లాడటం లేదు?. సన్నాసి పాల్పడుతున్న దోపిడీ ఆపితే మేం అనుకున్న అన్ని పాలసీలు అమలు చేయొచ్చు. రైతు డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తాం’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చుకోవడమే కాకుండా.. సర్వే బయటపెట్టి సడన్‌ బాంబ్ పేల్చారు. ఈ విమర్శలుసర్వేలపై బీఆర్ఎస్బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.