మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి జనరిక్ మందులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని,  పేద,  మధ్యతరగతి ప్రజలకు మందులు కొనుగోలు భారంగా మారిందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనరిక్ మందుల విధానం ప్రజలకు అందించాలని ఉద్దేశంతోనే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశ్వ భారతి డిగ్రీ కళాశాలలో జనరిక్ మందుల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి మాట్లాడుతూ పేటెంట్ హక్కులు ముగిసిన ఔషధాలు ఆ తరువాత జనరిక్ మందుల రూపంలో అందుబాటులోకి వస్తాయని,  ఔషధ మేళవింపు పనితీరులో ఎలాంటి తేడా ఉండనప్పటికీ అవి జనభాహుల్యంలో తగినంత ఆదరణ పొందలేకపోతున్నాయని,  బ్రాండెడ్ ఔషధాలలో పోలిస్తే జనరిక్ ఔషధాలు 80 శాతం తక్కువ ధరకే లభ్యమవుతాయని సాయి చౌదరి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ భక్తవత్సలం మాట్లాడుతూ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్న ఔషధాలలో దాదాపు 75 శాతం జనరిక్ రూపంలోనే అందుబాటులో ఉన్నాయని,  రోగులు మాత్రం జనరిక్  దుకాణాలనుంచి అధిక రక్తపోటు, మధుమేహము, కొలెస్ట్రాల్, విటమిన్ లోపం వంటి మందులనే ఎక్కువగా కొంటున్నారని,  వైద్యుల సైతం సామాన్యులను దృష్టిలో ఉంచుకొని జనరిక్ ఔషధాలను సిఫార్సు చేయటంతో పాటు వాటి పట్ల అపోహలను తొలగించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ విషయంలో జిల్లా రెడ్ క్రాస్  సొసైటీ ఆధ్వర్యంలో జనరిక్ మందుల పై అవగాహన కార్యక్రమాలను కళాశాల లలో విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమమునకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్, విశ్వ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి,  కళాశాల సిబ్బంది, విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.