ఈనెల 29న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈనెల 29న ఖమ్మంలో అమిత్ షా సభ జరగనుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గుజరాత్‌లో పెద్ద ఎత్తున తుఫాన్ కారణంగా చివరి నిమిషంలో ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ వాయిదా పడింది. 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసిన సేవ, సుపరిపాలన గురించే ఖమ్మంలో బహిరంగ సభ. వాయిదా పడిన సభ ఈ నెల 29న ఖమ్మంలో జరగనుంది. ఈ సభలో రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీ ఏర్పాట్లలో పాల్గొంటాం. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరం కలిసి ఏర్పాట్లు చేస్తాం. మా అంతర్గత రాజకీయాల్లో కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. దళిత బంధు విషయంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తాం. ఎరువుల బస్తా మీద సుమారు 2 వేల సబ్సిడీ బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. బీజేపీ అమలు చేస్తున్న ఏ పథకాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. బీజేపీ ఎదుగుదల ఆగిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నేనెప్పుడూ చూడని విధంగా గంజాయి సప్లై జరుగుతుంది. నేను చాలా బాధ్యతగా మాట్లాడుతున్నాను. గంజాయి మత్తుమందు, అక్రమ ఇసుక రవాణా విచ్చల విడిగా జరుగుతుంది. ఇటీవల జరిగిన యువమోర్చా నాయకుడు పవన్ సాయి హత్యపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలి.’’ అని పొంగులేటి డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.