చంద్రయాన్ 3 తో అంతరిక్ష పరిశోధనలో మైలురాయిని దాటిన భారత్ 

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చంద్రయాన్-3    విజయవంతం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుండి ఎల్వీఎం3-ఎం4  చంద్రయాన్-3  ను ఇస్రో  విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ఆకులస్వామి వివేక్ పటేల్ స్పందించారు.ఆకుల స్వామి వివేక్ పటేల్కన్వీనర్ జేఎన్టీయూహెచ్ జేఏసీజాతీయ బీసీ సంఘం జాతీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా  ఇస్రో చైర్మన్,  శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ  శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం ద్వారా  భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని,అంతరిక్ష శాస్త్ర సాంకేతికతలో దేశ పురోగతికి ఉపయోగపడుతుందని ఆకుల స్వామి వివేక్ పటేల్ కన్వీనర్ జేఎన్టీయూహెచ్ జాక్ తెలియజేశారు.ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.