కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని 26న చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ జులై 26 చలో ఢిల్లీ పోస్టర్ రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం  జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య   తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేనేలేదు 1921 లో ఇంపీరియల్ బ్యాంకు కుప్ప కూలినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యంగ్ కమిషన్,  రాయల్ కమిషన్, సైమన్ కమిషన్, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ ఒకటిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఏర్పడింది అంటే దానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఈ అంశంపై రాజ్యసభ సభ్యులను పార్లమెంటు సభ్యులను కూడగట్టి పార్లమెంట్లో కొట్లాడుతానని అన్నారు. కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి  జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాలన చేస్తున్న ప్రజా ప్రతినిధులారా పార్లమెంటులో  ఈ అంశంపై మాట్లాడకపోతే  ప్రజా ప్రతినిధులపై ప్రజాపూరు తప్పదని హెచ్చరించారు జులై 26న ఢిల్లీ వెళ్దాం రండి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించేంతవరకు యుద్ధం చేద్దాం రండి ఢిల్లీలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం  జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ శ్రీ కృష్ణ కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు ఆళ్ల రామకృష్ణ కొల్లి నాగేశ్వరరావు  జాతీయ ఉపాధ్యక్షులు  బొల్లి స్వామి ఎరుకల మహేందర్ గౌడ్ ఇడపాక సురేష్  నర్రా ప్రవీణ్ కోడిదల నరేష్ జేరిపోతుల ప్రశాంత్ ఘనపురం అశోక్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.