దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే చిన్న రాష్ట్రాల ద్వారానే సాధ్యం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారత దేశ ప్రగతికి అభివృద్ధికి పరిపాలన సాలభంగా చిన్న రాష్ట్రాలతోనే సాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతదేశంలోన పెద్ద రాష్ట్రాలయిన ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు వాటి రాజకీయబలంతో దేశంలోని వనరులను ఎక్కువ భాగం వినియోగించుకోచున్నవిసహాయాన్ని ఈ సందర్బంగా వారు గుర్తు చేసారు. బాషాప్రయుక్త  రాస్తాలనుంచి పరిపాలన సౌలభ్య రాష్ట్రాల ముందుకు మార్గం అనే అంశం పై హైదరాబాద్ లో సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో ఫార్మర్ హైకోర్టు జడ్జి జస్టిస్ జి యతి రాజులు, డాక్టర్ సంజీవ్ చోప్రా రిటైర్డ్ ఐఏఎస్, రాయలసీమ విమోచన సమితి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కేకే గోయల్ రిటైర్డ్ ఐఏఎస్, బిపి ఆచార్య రిటైర్డ్ ఐఏఎస్, సంతోష్ మెహర రిటైర్డ్ ఐఎఇస్, సంఘటిత సమితి బొజ్జ దశరథ రామ్ రెడ్డి, నాచప్ప ల్యాండ్ కర్ణాటక బొంగు ప్రసాద్, కమలేష్ జా ఫెడరేషన్ ఫర్ న్యూ స్టేట్స్ న్యూఢిల్లీ ,జ్యోతి సేతివ, రాకేష్ విశ్వకర్మ ప్రెసిడెంట్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్బంగా జస్టిస్ జి యతి రాజులు కీలకోపన్యాసం చేస్తూ   పెద్ద రాష్ట్రాల పెత్తనం దేశం మీద బాగా కనబడుతుందన్నారు. ప్రాంతీయ అసమానతలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, రాష్ట్రాల ప్రజల సంఖ్యతో ఈ ఆసమానతలు పెరిగిపోతున్నాయన్నారు.రాష్ట్రాల విభజన వలన తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఎంతో గొప్ప అభివృద్ధి సాదించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. చిన్న రాష్ట్రాల వలన మేలు జరుగతామే కాకుండా మంచి పరిచయం, అత్యంత ప్రజాస్వాంబిక విలువలు కలిగి ఉండటం, మంచి పరిపాలన ప్రాంతీయ అసమానతలు రూపుమాపి పోతాయన్నారు. వెంటనే భారతదేశంలో మరో 19 రాష్ట్రాలు చేయాలని దాంట్లో 47 రాష్ట్రాల్లో ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వతోముకాభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణ, చత్తీస్గడ్ రాష్ట్రాలు విభజన తర్వాత ఎంతో ఆర్థిక అభివృద్ధి అన్ని రంగాలలో ఎంతో చూపించడం అందరికీ తెలిసిన విషయమే నన్నారు.ఈ కార్యక్రమం లో  నిర్వాహకులు మెట్ట రామారావు ఐ ఐ ఆర్ ఎస్ రిటైర్డ్, ఆళ్ల రామకృష్ణ చీఫ్ ఇంజనీర్ రిటైర్, నగేష్ భూషణ్ సోషల్ వర్కర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.