యూపీఏ పేరు ‘పేట్రియాటిక్ డెమొక్రిటిక్ అలయన్స్(పీడీఏ)’గా మార్పు ?

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దేశ రాజకీయాల్లో కూటములు ప్రధాన పాత్ర వహిస్తుంటాయి. ఇప్పటి వరకు చూసుకుంటే జాతీయంగా రెండు కూటములు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి యూపీఏ అయితే మరొకటి ఎన్డీయే. యూపీఏ అంటే యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ అని.. ఎన్డీయే అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని అంటారు. అయితే యూపీఏలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలో బీజేపీ ఆధిపత్యం వహిస్తున్నాయి. 2004లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో యూపీఏ కూటమి ఏర్పడింది. ఇందులో వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి

ప్రస్తుతం యూపీఏ పేరును మార్చాలని పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రస్తుతం యూపీఏలో చేరాలని భావిస్తున్నాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో యూపీఏ కూటమికి కొత్త పేరును ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం బెంగళూరులో 20కి పైగా పార్టీలు పాల్గొనే మెగా ప్రతిపక్ష సమావేశంలో కొత్త పేరును నిర్ణయించే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు చెప్తున్నారు.

యూపీఏ పేరును ‘పేట్రియాటిక్ డెమొక్రిటిక్ అలయన్స్(పీడీఏ)’ అని పేరు పెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బెంగళూరులో జరగనున్న రెండు రోజుల సమావేశాల్లో యూపీఏ పేరు మార్పుపై విస్తృతంగా చర్చించి పీడీఏ అని ఫైనల్ చేస్తారా, మరో పేరేదైనా పెడతారా అనేది వేచి చూడాలి. ప్రస్తతం యూపీఏ కూటమి తరపున లోక్సభ నాయకుడిగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వ్యవహరిస్తుండగా.. రాజ్యసభ నాయకుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విప‌క్షాల‌ను ఏకం చేసే దిశ‌గా అవ‌స‌ర‌మైన వ్యూహాల‌ను ఈ సమావేశాల్లో ఖ‌రారు చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.