పార్టీలది ఒకే ఒక మంత్రం అది కుటుంబం కోసం

.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరులో సమావేశమైన పార్టీలకు ఒకే ఒక మంత్రం ఉందనిఅది.. కుటుంబం యొక్కకుటుంబం ద్వారాకుటుంబం కోసం అని వివరించారు. అందుకే ప్రజలు 2024లో మళ్లీ ఎన్డీయేను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారన్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా బెంగళూరులో జరుగుతున్న సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటుండగాన్యూఢిల్లీలో జరిగే ఎన్డీయే పక్షాల సమావేశానికి 38 పార్టీలు హాజరుకాబోతున్నాయని తెలుస్తోంది.

అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూభారత దేశ దుఃఖానికి బాధ్యులైనవారు ఇప్పుడు తమ దుకాణాలను తెరిచారని చెప్పారు. ఈ దుకాణాల్లో కులతత్త్వ విషంవిపరీతమైన అవినీతి గ్యారంటీగా దొరుకుతాయన్నారు. ఇప్పుడు ఈ పార్టీలు బెంగళూరులో ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. ఈ ప్రతిపక్షాలు ఓ పాట పాడుతున్నాయనిఅయితే వాస్తవం వేరొకటి ఉందని చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘‘ఇది కట్టర్ అవినీతి సమ్మేళనమని ప్రజలు అంటున్నారు. ఈ సమావేశానికిగల మరొక ప్రత్యేకత ఏమిటంటేకోట్లాది రూపాయల అవినీతి కేసులో బెయిలు మీద బయట ఉన్నవారిని ఎంతో గౌరవంతో చూస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులంతా బెయిలు మీద ఉంటేమరింత ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఓ జన సముదాయాన్ని అవమానించినందుకు కోర్టు శిక్షిస్తేఅలా శిక్ష పొందినవారిని గౌరవిస్తున్నారు’’ అని మోదీ చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందుఆ తర్వాత జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూబెంగళూరు సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలను వారిపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి అడిగినపుడువారు మౌనంగా ఉన్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయనిదీనిపై వీరంతా మౌనాన్ని ఆశ్రయించారని చెప్పారు. తమను కాపాడాలని కాంగ్రెస్వామపక్షాల కార్యకర్తలు వేడుకున్నప్పటికీవారి నేతలు మాత్రం స్వార్థపూరిత రాజకీయాలకోసం వారిని దయనీయ పరిస్థితుల్లో వదిలేశారన్నారు. తమిళనాడులో అవినీతి కేసులు చాలా ఉన్నాయన్నారు. ఈ కేసులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయనినిందితులకు ప్రతిపక్ష నేతలు క్లీన్ చిట్ ఇస్తున్నారని తెలిపారు.

బెంగళూరులో జరుగుతున్నది స్వచ్ఛమైన అవినీతి సమావేశమని ఆరోపించారు. ఈ పార్టీలకు అభివృద్ధిపై దృష్టి లేదనికొన్ని పార్టీలు తమ వంశపారంపర్య వారసత్వ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాయనిదేశ ప్రయోజనాలుసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామిక వ్యవస్థలో వారసత్వ రాజకీయాలకు ప్రతిపక్ష పార్టీలు గుడ్డిగా మద్దతిస్తున్నాయన్నారు. రూ.20 లక్షల కోట్ల అవినీతి గ్యారంటీతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయని మండిపడ్డారు.

అందరికీ అవకాశాలు

అందరినీ కలుపుకొనిపోతూఅందరికీ అవకాశాలు లభించే సరికొత్త అభివృద్ధి నమూనాకు తాను కట్టుబడి ఉన్నానని మరోసారి మోదీ తెలిపారు. తన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యంవిద్యమౌలిక సదుపాయాలుఅండమాన్ అండ్ నికోబార్ దీవులు అభివృద్ధి చెందినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.