ప్రథమ చికిత్స మన ప్రాథమిక బాధ్యత

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఏదైనా అనుకోని సంఘటనఆకస్మాత్తుగా రుగ్మతతో రోగికి చికిత్స అవసరమైనప్పుడు శిక్షణ పొందని సాధారణ వ్యక్తులు చేసే తొలి ఆరోగ్య సేవే ప్రధమ చికిత్స,  అత్యంత అమూల్యమైన వేళలో ప్రధమ చికిత్స చేయడం వల్ల ప్రాణాలు కాపాడిన వారమవుతామని ప్రధమ చికిత్స మన ప్రాథమిక బాధ్యతగా భావించాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి సల్బత్తాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రధమ చికిత్సపై అవగాహన కార్యక్రమంలో అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా  రెడ్క్రాస్   సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి మాట్లాడుతూ ప్రమాద వేళలో తల తిప్పుకుని వెళ్ళకండి,  తొలిసాయoని అందించండని రోగికి ఎంత త్వరగా చికిత్స అందితే,  కోలుకునే సమయంలో వచ్చే రికవరీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని అందువల్ల అత్యవసర సమయాలలో ప్రథమ చికిత్స అందజేసి రోగిని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించడం మంచిదని,  ప్రాథమిక చికిత్స అందించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని,  ఎదుటి వ్యక్తికి అత్యవసర సమయాలలో ప్రథమ చికిత్స చేయడం ఎంతో అవసరం అని అన్నారు.  ప్రధమ చికిత్సలు ఏబిసిడి లకు ప్రాధాన్యత ఉన్నదని ఇతర ప్రక్రియలో ఏ బి సి డి లు అంటే ప్రాథమిక అంశాలు కానీ ప్రథమ చికిత్సలో ఏ అంటే ఎయిర్ వే –  గాలి పీల్చే మార్గంలో అవాంతరం లేకుండా చూడటం,  బి అంటే బ్రీతింగ్ –  శ్వాస సరిగ్గా తీసుకునేలా చూడటం,  సి అంటే సర్కులేషన్ అంటే రక్తస్రావం అవుతుంటే ఆపి రక్త ప్రవాహ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చూడటం,  డి అంటే డెడ్లీ బ్లీడింగ్ ప్రాథమిక చికిత్సలో ఇవి చాలా ముఖ్యమైనవని సాయి చౌదరి అన్నారు.  సాయి చౌదరి ప్రధమ చికిత్స విశిష్టతను తెలియజేస్తూ ఈ ప్రక్రియలో మూడు బి‘ లను గమనించాలని అవి బ్రీతింగ్,  బ్లీడింగ్,  బోన్స్  శ్వాసక్రియ అయ్యేలా చూడటం రక్తస్రావాన్ని అరికట్టడం,  ఎముకలకు ప్రమాదం జరిగిందేమో పరిశీలించటం ఇవే ప్రధమ చికిత్సలోని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంశాలు అని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి అన్నారు.  ఈ కార్యక్రమనకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్సత్బల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రవికుమార్కళాశాల సిబ్బందివిద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.