విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా యున్న 44వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలనివిద్యా ప్రమాణాలు పెంచాలని వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జే‌ఏసి  ఛైర్మన్తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్, Bed, Ded టీచర్స్ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రావు నేతృత్వంలో విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి జరపడం జరిగింది. నిరుద్యోగులు ప్రభుత్వ శాఖలలో ఖాళీగా యున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.     ఈ ముట్టడిని ఉద్దేశించి నీల వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాటశాలల్లో 24 వేల DSC టీచర్ పోస్టులు భర్తీ చేయాలని  కోరారు. అలాగే ఎయిడెడ్ పాటశాలల్లో 4900 టీచర్ పోస్టులుఆదర్శ పాటశాలల్లో 2000కస్తుర్భా పాటశాలల్లో 1500 టీచర్ పోస్టులుఖాళీగా ఉన్నవి. ఇవిగాక ప్రభుత్వ పాటశాలల్లో 4 వేల కంప్యుటర్ టీచర్ పోస్టులు10 వేల పి.ఇ.టి. పోస్టులు5 వేల ఆర్ట్స్క్రాఫ్ట్స్ డ్రాయింగ్ పోస్టులు3 వేల లైబ్రేరియన్ పోస్టులు4 వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు10 వేల అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. ఇంత పెద్దఎత్తున ఖాళీగా ఉంటె భర్తీ చేయకుండా ఇటు విద్యార్థుల భవిష్యత్ అటు నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోకి చుచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి సమీపం లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ ముట్టడిలో మల్లేశ్ యధవ్భాస్కర్ ప్రజాపతి  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.