వర్షాలు ఆగిపోయే వరకు  ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి

-     మేడ్చల్ జిల్లా బీజేపి అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యార్థిని విద్యార్థుల తల్లి తండ్రుల కోరిక మేరకు తెలంగాణలో వర్షాలు ఆగిపోయే వరకు  ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించాలని,అలాగే ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ కాలేజీలతో పాటు యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించాలని మేడ్చల్ జిల్లా బీజేపి అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.గత రెండురోజులనుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలోని నీరు రోడ్లపై ఎక్కువగా ప్రవహిస్తున్నప్పుడు మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయి, ఎక్కువగా ప్రవహించే వరదనీటితో రోడ్లన్నీ గుంతల మయంగా మారుతాయి, ఈదురు గాలులతో చెట్లు కరెంటు స్థంబాలు రోడ్ల మీద పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అదే విదంగా ప్రైవేట్ పాఠశాలలు  వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాలని వర్షాల ప్రభావంతో విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనే భావనతో పలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. కావున అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలి అని గాలి సంపత్ యాదవ్ రాష్ట్ర ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.