బిసిల లక్ష రూపాయల  ఆర్థిక సహాయం పథకంలోదళారుల చేతి వాటం  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీ కులవృత్తిదారుల కుటుంబంలో ఒక సభ్యుడికి  రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల  ఆర్థిక సహాయం పథకంలో   ఒకే కుటుంబంలో నాలుగైదుగురు సభ్యుల పేర్లను పథకంలో అర్హులుగా  చేర్చి రుణాలు ఇప్పిస్తామని  ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రము లో కొందరు దళారులు చేతివాతాన్ని ప్రదర్శించుతున్నారని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ పేర్కొన్నారు.కొమరం భీమ్ ఆసిఫాబాద్ జి ల్లాలో ఒక్కొక్కరితో  మండల స్థాయి నాయకులు  20 నుండి 30 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఇట్టి విషయాన్ని ప్రముఖ దినపత్రికలో వెలువడిన నేపద్యం లో ఆయన స్పందించారు. ఏదీ తరహాలో రాష్ట్రము లో పలు చోట్ల బిసి రుణాలు ఇప్పిస్తామని డబ్బులు కాజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు.132 బిసి కులాల్లో నిరుపేద బిసి కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ప్రకటించిన ప్రభుత్వం మరో దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. నిరుపేదలను వంచెంచి మోసం చేసే వారిపై చట్టపరంగా శిక్షించాలని  కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా  లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి దరఖాస్తు చేసుకున్న  ప్రతి వ్యక్తిలక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని, 2015- 16, మరియు 2017– 18 ఆర్థిక సంవత్సరాలలో  రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాసుదారులందరికి  100% రాయితీతో ఆర్థిక సహాయం అందించి బీసీల సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని  లేనియెడల ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని  శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.