24న పొంచి ఉన్న మరో అల్పపీడనం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే భారత వాతావరణ విభాగం (IMD) మరో పిడుగులాంటి వార్తను అందించింది. తెలుగు రాష్ట్రాలకు హై అలెర్ట్ ప్రకటించింది. నేడు ఆంధ్రప్రదేశ్తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 24న మరో అల్ప పీడనం పొంచి ఉందని తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెంసంగారెడ్డిమెదక్‌లలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లో లెవల్‌ వంతెనలపై వరదనీరు పొంగి పోర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి పెద్దమొత్తంలో వరద పొటెత్తుతున్న కారణంగా ఆ ప్రాజెక్టుల పరిస్థితి టెన్షన్‌గా మారుతోంది. అయితే గోదావరి నది మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే మళ్లీ వర్ష సూచన. కాగా.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణం క్యుములోనింబస్ మేఘాలు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు చాలా ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయి. వీటి వల్ల ఇంకో ఇబ్బంది ఏంటంటే.. ఉరుములుమెరుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పిడుగు పాటుకు అవకాశం ఎక్కువ. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.