ఆచార్య ఎన్.జీ.రంగా యూనివర్సిటీ అగ్రిసెట్ 2023 నోటిఫికేషన్ను విడుదల
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఎన్జీఆర్ఏయూ)-‘అగ్రిసెట్ 2023’ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిని వ్యవసాయ విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్దేశించారు. ఈ ఎగ్జామ్లో సాధించిన స్కోర్ ద్వారా నాలుగేళ్ల వ్యవధి గల ‘బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్’ ప్రోగ్రామ్లో అడ్మిషన్స్ ఇస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, అనుబంధ అగ్రికల్చరల్ కళాశాలల్లో నిర్దేశిత సీట్లు భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాలు: అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్
సీట్ల వివరాలు: పాలిటెక్నిక్ వ్యవసాయ డిప్లొమా అభ్యర్థుల కోసం ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో 162 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 48 సీట్లు చొప్పున మొత్తం 210 సీట్లు నిర్దేశించారు.
· ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో అగ్రికల్చర్ అభ్యర్థులకు 133 సీట్లు, సీడ్ టెక్నాలజీ అభ్యర్థులకు 23 సీట్లు, ఆర్గానిక్ ఫార్మింగ్ అభ్యర్థులకు 6 సీట్లు ఉన్నాయి.
· అనుబంధ వ్యవసాయ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద అగ్రికల్చర్ అభ్యర్థులకు 39 సీట్లు, సీడ్ టెక్నాలజీ అభ్యర్థులకు 7 సీట్లు, ఆర్గానిక్ ఫార్మింగ్ అభ్యర్థులకు 2 సీట్లు ఉన్నాయి.
అర్హత: ఏఎన్జీఆర్ఏయూ/పీజేటీఎ్
అగ్రిసెట్ 2023 వివరాలు: అభ్యర్థులు తమ డిప్లొమా స్ట్రీమ్లోనే అగ్రిసెట్ ఎగ్జామ్ రాయాలి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మొత్తం 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. డిప్లొమా(అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ ఫార్మింగ్) ప్రోగ్రామ్లకు ఏఎన్జీఆర్ఏయూ నిర్దేశించిన సిలబస్ ప్రకారం ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం గంటన్నర. ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులకు కనీసం 25 శాతం(30)మార్కులు రావాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1400; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5
ఆన్లైన్ దరఖాస్తు ఎడిట్ విండో ఓపెన్: ఆగస్టు 11న
దరఖాస్తు హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేదీ: ఆగస్టు 16
హాల్ టికెట్స్ డౌన్లోడింగ్: ఆగస్టు 20 నుంచి 25 వరకు
అగ్రిసెట్ మాక్ టెస్ట్ తేదీలు: ఆగస్టు 25 నుంచి 30 వరకు
ఏఎన్జీఆర్ఏయూ అగ్రిసెట్ 2023 తేదీ: సెప్టెంబరు 1