జిపిఎస్ డాటా ఆధారంగా భూకంపాలను ముందే పసిగట్టవచ్చు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భూకంపాలు మిగిల్చే ఆస్తిప్రాణనష్టం మాటల్లో చెప్పలేనిది. భూకంపాలను ముందే గుర్తిస్తే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడొచ్చు. ఈ దిశగా శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ విషయంలో కీలక ముందడుగు వేశారు. భూకంపాలను రెండు గంటలు ముందే పసిగట్టొచ్చని వారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి కంటే వంద రెట్లు కచ్చితత్వంతో పనిచేసే జీపీఎస్‌ సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని వారు పేర్కొన్నారు.క్వెంటిన్‌ బ్లెటెరీజియాన్‌ మాథ్యూ అనే పరిశోధకులు టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికలకు సంబంధించిన జీపీఎస్‌ డాటా ఆధారంగా భూకంపాలను ముందే పసిగట్టొచ్చని పేర్కొన్నారు. 90 భూకంపాలకు సంబంధించి, 48 గంటలు ముందుగా సేకరించిన జీపీఎస్‌ డాటాను వారు విశ్లేషించారు. భూ కదలికల ఆధారంగా భూకంపాన్ని ముందే అంచనా వేయొచ్చని వారు పేర్కొన్నారు. అయితే ఇందుకు 0.1 మిల్లీమీటర్‌ పరిధిలో కదలికలను గుర్తించే జీపీఎస్‌ సెన్సార్లు అవసరమవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం అలాంటి సెన్సార్లు అందుబాటులో లేవనివాటిని అభివృద్ధి చేయగలిగితే కీలక పురోగతి సాధించవచ్చని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.