స్మిత సబర్వాల్ కు రఘునందన్ రావు కౌంటర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించటం, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సైతం స్తంభింపజేశాయి. ఈ ఘటనపై తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ నాలుగు రోజుల క్రితం ఓ ట్వీట్ పెట్టారు. చరిత్రలో ఎలాంటి కలహాలు జరిగినా మహిళలు నీస్సహాయ స్థితిలో నిలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మణిపూర్‌లో భయంకర హింసకాండలో నిస్సహాయులైన అమాయక మహిళలను ఊరేగిస్తూ వారిపై అత్యాచారం చేశారన్నారు. ఈ ఘటన మన మూలాలను కదిలిస్తోందని, ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తుందని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. రాష్ట్రపతిని కూడా ట్యాగ్ చేసిన ఆమె.. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై రాజ్యాంగపరమైన అధికారాలను అమలు చేయాల్సిందిగా కోరారు. నైతికతలేని మెజారిటీ మనోభావాలు మన నాగరికతను నాశనం చేసేలా ఉన్నాయని స్మితా సబర్వాల్ తన ట్వీట్‌లో వెల్లడించారు.ఆమె పెట్టిన ట్వీట్‌కు తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి చేశాడని.. ఈ ఘటనకు సంబంధించి స్మితా సబర్వాల్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. “బీజేపీ పాలిత రాష్ట్రాల ఘటనలపై సత్వరమే స్పందిస్తూ ట్విట్లు పెట్టే.. స్మితా సబర్వాల్ గారు మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నాం.” అని ఆయన ట్వీట్ చేశారు.స్మితా సబర్వాల్ వ్యవహారశైలిపై పలువురు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె వ్యవహారశైలి రాజకీయ నాయకురాలిగా ఉందని విమర్శిస్తున్నారు. నల్గొండ ఘటనపై స్మితా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. “మణిపూర్‌ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిచాల్సిందే మేడమ్‌. ఈ సమస్యను అక్కడి ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణలో కూడా మహిళలపై అత్యాచారాలు, అక్రమ రవాణా వార్తలు కలవర పరుస్తున్నాయి. వాటి మీద మీరు దృష్టి సారించగలరు. వేధింపులకు గురైన మహిళా పారిశ్రామికవేత్త శేజల్‌ సమస్యను వెంటనే పరిష్కరించగలరు.” అని కామెంట్లు పెడుతున్నారు.మణిపూర్ ఘటన నిందితుడి ఇంటిని తగలబెట్టిన స్థానికులునల్గొండలో ఏం జరిగిందంటే..భూ తగాదాలో ఓ దళిత మహిళపై సర్పంచ్, ఆమె కుటుంబసభ్యులు దాడి చేశారు. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో మహిళ పళ్లు ఊడిపోయాయి. నోట్లో నుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్నా ఆమెపై దాడి చేశారు. హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్న శారదను ఆదివారం దేవరకొండ డీఎస్పీ పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ తగాదా కారణంగా గ్రామ సర్పంచ్ ధనమ్మ, ఆమె కుటుంబసభ్యులు కులం పేరుతో దూషించి దాడి చేశారని బాధితురాలు డీఎస్పీకి వివరించింది. ఘటనపై పూర్తి వివరాలను సేకరించి, కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.