కెటిఆర్ సేవలు రాష్ట్రాభివృద్ధి కి ఎంతగానో అవసరం

-   సింగరేణి మాజీ అధికారి  కొమ్మిడి భూమా రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మున్సిపల్ శాఖ మంత్రి , బి ఆర్ ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు కు   మంథని కన్న బిడ్డ, సింగరేణి ముద్దు బిడ్డ , సింగరేణి మాజీ అధికారి  కొమ్మిడి భూమా రెడ్డి   పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేశారు.  వ్యక్తిత్వం, పోరాట పటిమ, సాధించిన విజయాలు రాష్ట్ర  ప్రగతిలో చిరస్మణీయమని అన్నారు. ఆయన సారథ్యం లో రాష్ట్రం లోని ఐ టి రంగం ఎంతగానో అభివృద్ధి సాధించిందని, పురపాలక శాఖలో ప్రవేశ పెట్టిన సంస్కరణలతో పట్టణాలు, నగరాల రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. రాష్ట్ర మంత్రిగా, బి ఆర్ ఎస్ నేతగా కెటిఆర్ సేవలు రాష్ట్రాభివృద్ధి కి ఎంతగానో అవసరమన్నారు.ఉదయించే సూర్యుడిలా , వెలుగునిచ్చే దివ్వెలా ,అహర్నిశలు అలుపెరుగని శక్తి తో తెలంగాణ అభివృద్ధి కై రాత్రి పగలనకుండా కష్టపడుతూ , ప్రజలందరి మన్ననలు పొందుతూ , దేశమే గర్వపడేలా ముందుకు సాగాలాని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.