వ్యాధుల వ్యాప్తికి అనుకూలమైన సమయం.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వివిధ రకాల వ్యాధి కారకాల పెరుగుదల వ్యాప్తికి, అనుకూలమైన సమయం అని దీని కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఇందుకుగాను  ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి సూచించారు.  ఈ సమయములో వేడి లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలని,  ముఖ్యంగా వీధి వ్యాపారుల నుండి  పచ్చి లేదా తక్కువ ఉడికించిన ఆహారాన్ని తినడం మానుకోవాలని,  తినడానికి ముందు పండ్లు కూరగాయలను శుభ్రమైన నీటితో బాగా కడుక్కోవాలి అన్నారు. అదేవిధంగా మంచి వ్యక్తిగత పరిశుభ్రతను, హ్యాండ్ వాష్ పద్ధతులను పాటించాలని, నిద్రపోయేటప్పుడు దోమల నిరోధకాలు, దోమతెరలను ఉపయోగించాలని,  దోమకాటును తగ్గించడానికి పొడవాటి చేతుల దుస్తులు ధరించాలన్నారు. దోమల అభివృద్ధిని నిరోధించడానికి పరిసర ప్రాంతం చుట్టూ నిలిచిపోయిన నీటిని తొలగించాలని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులతో దూరముగా ఉండాలని, ధగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పి ఉంచడం ద్వారా మంచి శ్వాస కోస పరిశుభ్రతను పాటించాలని సూచించారు. సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలని లేదా హ్యాండ్ శానిటైజర్ ను ఉపయోగించాలని, అంటు వ్యాధులు, గాయాలను నివారించడానికి వర్షపు నీరు నిలువ ఉన్న ప్రాంతాల గుండా నడవటం మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి మాట్లాడుతూ సమతుల్య ఆహారము, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా రోగనిరోధక శక్తిని మంచి గాలి ఉండేలా చూసుకోవాలన్నారు.  తడిగా లేదా సరిగా గాలిలేని ప్రదేశాలలో ఉండకుండా చూసుకోవాలని, వర్షాల సమయంలో గొడుగులు,  రైన్ కోట్లు తీసుకెళ్లాలని కోరారు.  ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా పల్లె దావకానాలను సందర్శించాలని సూచించారు. ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆరోగ్యానికి కాపాడుకోవడానికి వర్షాకాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరమని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి ప్రజలకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.