భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మహబూబాబాద్‌ జిల్లాలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌తో కలిసి మున్నేరు వాగు వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.అలాగే పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మహబూబాబాద్‌లోని పలు కాలనీల్లో నీళ్లు నిలిచిన చోట అధికారులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సాధ్యమైనంతవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ శరద్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.