భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా హుస్సేన్ సాగర్

-    ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు.. ప్రస్తుతం లెవల్ 513.47 మీటర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. భాగ్యనగరంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కూకట్‌పల్లి నాలాల నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్‌ను దాటేసింది. హుస్సెన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం అంతేలా అంటే 513.47 మీటర్లుగా నీటి మట్టం కొనసాగుతోంది. నీటిమట్టం ఫుల్‌ట్యాంక్ లెవల్ దాటంతో అధికారులు తూముల ద్వారా హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. దీంతో మూసి పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.మరోవైపు జంట జలాశయాలకు వరద పోటు అధికంగా ఉంది. ఉస్మాన్‌సాగర్ ఇన్ ఫ్లో 1700 క్యూసెక్కులుగా ఉండగా… హిమాయత్‌సాగర్‌కు 1500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1787.10 అడుగులకు చేరింది. అలాగే హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1761.75 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 1761.50 అడుగులుగా కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.