సోమవారం తెరుచుకోనున్న విద్యాసంస్థలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ సోమవారం తెరుచుకోనున్నాయి.కాగాభారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. . ములుగు జిల్లా ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్యభూపాలపల్లి జిల్లాకు పీ.గౌతమ్‌నిర్మల్‌ జిల్లాకు ముషారఫ్‌ అలీమంచిర్యాల జిల్లా ప్రత్యేక అధికారిగా భారతి హోళికేరిని నియమించారు.

Leave A Reply

Your email address will not be published.