సమగ్ర పోషకాల ద్వారానే సుస్థిర వ్యవసాయం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జూలై 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 125000 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ వారు దేశ వ్యాప్తంగా కేంద్రాలను ఎంపిక చేశారు. ఇందులో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షామీర్ పేటలో ఏర్పాటుచేసిన పిఎం కేఎస్ కే కి చోటు లభించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని పి యం కెఎస్ కేఎస్ ప్రాముఖ్యతను కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసే సేవలను ఎరువుల పైన గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జీవీ సుబ్బారెడ్డి బిజినెస్ హెడ్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాకు చెందిన 500 మంది పైగా రైతులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సల్ఫర్ కోటెడ్ యూరియాను ఆవిష్కరించారు. మరియు పిఎం కిసాన్ నిధుల 14వ విడత పంపిణీలో భాగంగా 8.కోట్ల రైతులకు 17, 500 కోట్ల విడుదల చేశారు. కోరమండల్ సంస్థ ప్రతినిధులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన 4200 పిఎంకెఎస్కే కేంద్రాలలో ఈ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని రైతుల కోసం ప్రదర్శించారు సుస్థిర వ్యవసాయం మరియు సమగ్ర పోషక యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పిఎంకెఎస్కే కేంద్రాల ద్వారా భూసార పరీక్ష మరియు విస్తరణ సేవలు వినియోగించుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. బిజినెస్ హెడ్ మాధవ్ మాట్లాడుతూ కోరమండల్ సంస్థ వారు రైతులకు శ్రేష్టమైన ఎరువులను సూక్ష్మ పోషకాలను మరియు సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో అందించడం ద్వారా రైతుల ఆర్థిక పూర్వకమణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి భాస్కర్ రెడ్డి, డాక్టర్ వినయ్ కుమార్ పరీడ, డాక్టర్ సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పి ప్రసాద్, డి వి ఎల్ ఎన్ రాజు, అవినాష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.