మధ్య మానేరుకు భారీగా వరద

.. 22 గేట్లు ఎత్తివేత

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కుండపోత వర్షాలతో రాజన్న సిరిసిల్లలోని రాజరాజేశ్వర మిడ్‌ మానేరుకు భారీగా వరద వస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అధికారులు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువ మానేరుకు వదిలారు. వేములవాడ మూలవాగుతో పాటు నర్మాల ఎగువ మానేరు జలాశయాల నుంచి ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం వస్తున్నది. ప్రస్తుతం మిడ్‌ మానేరు జలాశయానికి 1.05లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. అధికారులు 1.10లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదిలారు. డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.