ములుగు జిల్లాలో వరద నీటిలో గల్లంతైన ఎనిమిది మంది మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్త్ను భారీ వర్షాలకు జనజీవనం స్థంభిచిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం గల్లంతైన వ్యక్తులలో నాలుగు మృతదేహాలు లభించగా మధ్యాహ్నం వరకు మరో నాలుగు మృతదేహాలు లభించినట్లు సమాచారం.దీంతో గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలో తొమ్మిది మంది వ్యక్తులు వరదల కారణంగా మృతి చెందారు. వర్షం కొంత తెరిపివ్వడంతో జలదిగ్భందంలో చిక్కుకుని మునిగిపోయిన ఇండ్లు తేలాయి. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు ధ్వంసమైపోయాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారి కొట్టుకుపోయాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.