వర్షాలపై ప్రభుత్వానికి ముందు చూపులేదు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వర్షాల పై ప్రభుత్వానికి  ముందుచూపు లేకపోవడం తో ప్రజలు అనేక ఇబ్బందుల కు గురికావలసి వచ్చిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్  విమర్శించారు.బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతున్న ఈ సందర్బంగా మాట్లాడుతూ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుందని, ప్రజలు ఈ వర్షాలకు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. గతంలో ఇంతకంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని అయినా ఈ ప్రభుత్వం ముందుచూపు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రజల ప్రాణాలతొ ఆడుకుంటుందని గత 9 సంవత్సరాలుగా మున్సిపల్ మంత్రులుగా ఈ తండ్రీ కొడుకులు ఉన్నారు.ఒక పక్క ప్రజలు వర్షాలు వరదలతో అష్టకష్టాలు పడుతుంటే కార్యకర్తలు కొడుకు జన్మదిన వేడుకలు అట్టహాసంగా ఫ్లెక్సీలు ,కేకులు అంటూ సంబరాలు చేసుకుంటూ పెద్దల మన్ననలు కోసం ఆడంబరాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు.ఈ తండ్రీ కొడుకులు అధికారం కోసం పడే ఆరాటం ప్రజల ప్రయోజనాల కోసం ,వారి కష్టాల కోసం ఆలోచించట్లేదని విమర్శించారు.గ్రేటర్ ఎన్నికల సమయంలో ఇప్పటి వర్షపాఠం కంటే తక్కువ వర్షపాతం ,ముంపు వస్తే ఇంటికి పదివేలు ఇచ్చారు కాని ఇప్పుడు కనీసం పలకరించే నాదుడే కరువయ్యారు అని తెలిపారు.మిషన్ కాకతీయ పేరుకే చెరువుల పూడికలు తీసుంటే వరద నీరు కాలనీలలోకి ,ఊర్లలోకి రాకుండా ఆ చెరువులలోకి వెళ్ళేవి.కానీ ఈ మిషన్ కాకతీయ నగరంలో అమలు కాలేదని స్పష్టంగా కనపడుతుంది.ఉన్న చెరువులు బిఅర్ఎస్ నాయకులు,ప్రస్తుత ,గత మేయర్ల కబ్జాలతొ కనుమరుగయ్యాయి.300 చెరువుల పరిస్థితి దుస్థితి ఇదే విదంగా ఉంది.ఇప్పటికైనా మంత్రి,ముఖ్యమంత్రి ఈ ముంపు సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.నష్టపోయిన వారిని ఆదుకొని మీ పనితీరు,పనితనం మెరుగుపరుచుకోవాలి అని తీవ్రంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు గారు,రాష్ట్ర కార్యదర్సి ఉమారాణి,అధికార ప్రతినిధి విఠల్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ గారు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.