కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజుల స్కీం పునరుద్దరించలి

 - ఫీజుల బకాయిల 5వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. - కార్పొరేట్ కాలేజీలను నిషేధించాలి. - మెస్ ఛార్జీలు పెంచాలి - బిసి కాలేజీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. - బీసీ విద్యార్ధుల మహా దీక్షాలు.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల రియంబర్స్ మెంట్ స్క్రీమును పునరుద్దించాలని, గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిల 5 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు 5 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్ధులు నేడు బీసీ భవన్ నందు దీక్షాలు చేపట్టారు. ఈ మహా దీక్షలకు రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ నాయకత్వం వహించారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ ఫీజుల బకాయిలు 5వేల కోట్లు బిల్లులు ట్రెజరీ పెండింగ్ లో యున్న బడ్జెటు లేక పాస్ కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా దివాళా తీసింధన్నారు. 2008లో బి.సి. సంక్షేమ సంఘం పోరాడి ఫీజుల రియంబర్స్మెంటు స్కీము పెట్టించినపుడు కాలేజి కోర్సుల మొత్తం ఫీజులను మంజూరు చేసే విధంగా ప్రభుత్వం జి.ఓ. నెం. 18 జారీ చేశారు. 2013 వరకు పూర్తి ఫీజులు మంజూరు చేశారు. ఇంజనీరింగ్ / మెడిసిన్ / యం.బి.ఎ./ యం.సి.ఎ./ పి.జి./ డిగ్రీ తదితర కోర్సుల ఫీజులను ఎంత ఉంటే అంత మొత్తం ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజలు ప్రభుత్వం భరించేది. 2014 ప్రభుత్వం పూర్తి ఫీజుల స్కీముకు పరిమితులు విదిస్తూ ఇంజినీరింగ్ కు 35 వేలు మాత్రమే మంజూరు చేస్తామని, ఇతర కోర్సులకు పరిమితి విదిస్తూ జి.ఓ.లో మార్పులు చేశారు. చాలా ఇంజనీరింగ్, యం.బి.ఎ., యంసి.ఎ., కాలేజీలలో 35 వేల కంటే ఎక్కువ ఫీజులు పెంచారు. పి.జి కి 20 వేల కంటే ఎక్కువ, డిగ్రీకి 10 వేల కంటే ఎక్కువ ఫీజులు పెంచారు. పెంచిన ఫీజులు కట్టలేక బి.సి విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంజినీరింగ్ లో 35 వేల కంటే ఎక్కువ యున్న ఫీజులను కట్టే ఆర్థికస్తోమత లేక, అప్పులు పుట్టక వేలాది మంది బి.సి. విద్యార్థులు చదువు మానుకుంటున్నారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు పూర్తి ఫీజులు కేంద్ర ప్రభుత్వం  మంజూరు చేస్తున్నారు. మైనార్టీ ముస్లింలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం  పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ జి.ఓ. జారీచేశారు. కాని బి.సి.లు ఉద్యమాలు చేస్తుంటే కూడా బి.సి. విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు. బి.సి.లలో పుట్టడమే పాపమా! బి.సి.లు పన్నులు కట్టడంలేదా! దేశ సంపద సృష్టించడం లేదా! ఎందుకింత బి.సి.ల పట్ల చిన్న చూపని కృష్ణయ్య ద్వజమెత్తారు.సభను ఉద్దేశించి వేముల రామ కృష్ణ ప్రసంగిస్తూ శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఎక్కువ ఫీజులులాగుతు రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారు. బట్టీ చదువులు, బలవంతపు చదువులతో విద్యార్థులను వేధిస్తున్నారు. అందుకే రోజుకొక్కరు చనిపోతున్నారు. రాష్ట్రంలోని 60 శాతం విద్యార్థులు ఈ కాలేజీలలో చదువుచున్నారు. ఈ కాలేజీల వల్ల విద్యావ్యవస్థ భ్రష్ఠు పడుతుంది. వీటిని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తూ ఆత్మహత్యలకు దోహధం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలను నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమం లో నీల వెంకటేష్, పి. సుధాకర్, అనంతయ్య, రాజ్ కుమార్, నంద గోపాల్, నాగరాజు, భాస్కర్ ప్రజాపతి, మల్లేశ్, మోడి రాందేవ్, అరవింద్, నిఖిల్ పటేల్ , అన్నపూర్ణ, కోటేశ్వరి, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ స్కీము పునరుద్దరించక పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వ్యతిరేక ప్రచారం చేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.