వీడు కొడుకు కాదు, రాక్షసుడు..

- తల్లిని చంపి, ముక్కలు ముక్కలుగా నరికాడు..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నవమాసాలు కడుపులో మోసి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేసిన తల్లిని ఏ కొడుకైనా చంపుతాడా? చంపడం కాదు కదా.. అసలు పల్లెత్తి మాట చెప్పడానికి కూడా సాహసించడు, అసలు ఆ కోణంలో ఆలోచించడు కూడా! కానీ.. ఓ రాక్షసుడు మాత్రం ఆ దుర్మార్గానికి పాల్పడ్డాడు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ తనకు జీవం పోసిన తల్లిని కడతేర్చాడు. అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ఫ్రిడ్జ్‌లో ఆ ముక్కలను కుక్కి, ఓ చెరువు వద్ద పారేశాడు. ఒళ్లు గగుర్పొడిచేలా బెల్జియన్‌లో  చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..లీజ్ సమీపంలో ఉన్న ఓ కాలువ వద్ద స్థానికులకు ఒక ఫ్రిడ్జ్ కనిపించింది. అందులో ఏముందని దగ్గరికి వెళ్లి చూడగా.. చిన్నాభిన్నమైన ఓ వృద్ధురాలి మృతదేహం చూసి వాళ్లు ఖంగుతిన్నారు. ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయగా.. వారు రంగంలోకి దిగారు. ఫ్రిడ్జ్‌లో రెండు చేతులు, రెండు కాళ్లు ఉండగా.. మరో కంటైనర్‌లో మృతురాలి తల, మిగతా శరీర భాగాన్ని కనుగొన్నారు. బాడీ పార్ట్స్ మొత్తం సేకరించి పోస్టుమార్టం కోసం పంపించారు. పలు ఆధారాల్ని సేకరించిన అనంతరం.. ఆ మృతదేహం ఎవరిదనే విషయాన్ని కనుగొన్నారు. తల్లి మృతదేహం పోలీసులకు దొరికిందన్న విషయం తెలుసుకున్న నిందితుడైన ఆమె కొడుకు.. కొరియాకు పారిపోయేందుకు ప్రయత్నించాడు.

Leave A Reply

Your email address will not be published.