భారీ వర్షానికి ప్రత్యక్షమైన అరుదైన పాము

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇది అల్బినిజం అని పిలువబడే జన్యుపరమైన అసాధారణతతో జన్మిస్తుంది. దీని శరీరం, కళ్ళలో కలర్‌ ఉండదు. ఇది పూర్తిగా తెల్లటి రంగులో ఉండే పాము. విలక్షణమైన నిర్దిష్ట రంగు లేకపోవటం, తెల్లగా కనిపించటం కారణంగా దీనిని శ్వేతనాగు అని పిలుస్తారు. ఇవి రెచ్చగొడితే కాటేసే పాములు కావని, ఆత్మ రక్షణ కోసం అది తన శరీరాన్ని చుట్టేసుకుని తలను దాచుకుంటుందని తెలిపారు. మీకెప్పుడైనా ఇలాంటి పాములు కనిపిస్తే కంగారుపడి చంపేయకుండా.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా మోసళ్లు, పాములు, ఇతర అడవి జంతువులు ఇళ్లలోకి కొట్టుకువస్తున్నాయి. వరద సమయాల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో అరుదైన తెల్లటి రంగు అల్బినో పాము కనిపించింది. ఆ తెల్లటి శ్వేతనాగు వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడింది. ఆ పాము ఐదు అడుగుల పొడవు కలిగి ఉంది మరియు చంబా జిల్లాలో పొదల మధ్య పాకుతున్నట్లు కనిపించింది. ఇలాంటి అరుదైన, వింత పామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. భయపడుతూనే శ్వేతనాగుతో సెల్ఫీలు దిగేందుకు కూడా ఉత్సుకతను చూపించారు. అది నేలపై మెల్లగా పాకుతూ, ఒక రాయి చుట్టూ చుట్టుకుంది. చివరికి చెట్టు కొమ్మల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించింది. గతేడాది పూణెలో అల్బినో పాము కనిపించింది.
Leave A Reply

Your email address will not be published.