న్యాక్‌ ఆధ్వర్యంలో 160మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఉపాధి కల్పనలో తెలంగాణ దేశానికే రోల్‌మాడల్‌గా నిలుస్తుందనిస్వరాష్ట్రంలోనే మహిళ సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారనిపాలన దక్షతలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించడంతోనే.. ప్రతి రంగంలో మహిళమణులు దూసుకెళ్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) వారి ఆధ్వర్యంలో 160మంది మహిళలకు కట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మేయర్‌ మేకల కావ్యడిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం తెలంగాణకే వలస వస్తున్నారనిమహిళలు స్వయం కృషితో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవనిమహిళల రక్షణకోసం షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారనిఅమ్మాయిల చదువు కోసం ప్రత్యేకంగా గురుకులాలు నెలకొల్పిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.మహిళలు కుట్టు మిషన్‌లో ప్రత్యేకతను కనబర్చిఇతరులకు ఉపాధిని కల్పించి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రామలింగంకార్పొరేటర్లు ఏకే మురుగేష్‌లలితాయాదవ్‌జిట్టా శ్రీవాణిశ్రీనివాస్‌రెడ్డినిహారికగౌడ్‌మెట్టు ఆశాకుమారిలావణ్యసతీష్‌గౌడ్‌శ్రీనివాస్‌రెడ్డివేణుశారదామనోధర్‌రెడ్డిపల్లపు రవివేణుకోఆప్షన్‌సభ్యులుబీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కొండల్‌ ముదిరాజ్‌న్యాక్‌ అధికారులునాయకులు సాధిక్‌ప్రకాష్‌నవీన్‌యాదవ్‌మున్సిపల్‌రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.