భూటాన్ లో తక్కువ ధరకే బంగారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భూటాన్‌లో తక్కువ ధరకే బంగారం లభిస్తుందన్న మాట పూర్తిగా నిజం. ఈ విషయం నమ్మాలంటే కొన్ని నెలలు వెనక్కి వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరి 21న పన్ను రహిత బంగారాన్ని ఇక నుంచి దేశంలో విక్రయించనున్నామని భూటాన్ ప్రకటించింది. దీంతో భారతీయులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు కూడా ప్రయోజనం పొందనున్నారు. ఇంతవరకు తక్కువ ధరకే బంగారం కొనుక్కోవడానికి దుబాయ్ వెళ్లిన భారతీయులు ఇప్పుడు భూటాన్‌కు వెళ్లడానికి కారణం ఇదే. భారతీయులు బంగార ప్రియులు.. అయితే రోజు రోజుకీ బంగారం ధర చుక్కలను తాకుతుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు నగలు కొనుగోలు చేద్దామని ఆసక్తిగా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. భూటాన్‌కు వెళ్లండి. ప్రస్తుతం భూటాన్ లోని బంగారం ధరపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతేకాదు బంగారం నిజంగా చౌకగా ఉందా అని అందరూ అడుగుతున్నారు. ఈ ప్రశ్న తలెత్తడానికి చాలా కారణాలు ఉన్నాయి. భారతీయులకు బంగారం స్టేటస్ సింబల్ మాత్రమే కాదు.. ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే ఆదుకునే గొప్ప సాధనం. అందుకనే ఎక్కువమంది తమ కష్టార్జితాన్ని శక్తిమేరకు బంగారు ఆభరణాల కొనుగోలకు ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో  ఎక్కడ తక్కువ ధరకు బంగారం దొరికితే అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూస్తారు.

Leave A Reply

Your email address will not be published.