రాష్ట్ర రాజధానిలో దంచికొట్టిన వాన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగరంలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉన్నట్లుండి వాతావరణం చల్లబడి పలుప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. నగర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచే మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి అన్ని చోట్ల వర్షం పడటం తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్లలో నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. వర్షం ధాటికి చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి ఆ నీరంతా రోడ్డుపైకి రావడంతో డిజాస్టర్ట్ టీమ్స్ మోటార్లతో వర్షం నీటిని తొలిగిస్తున్నారు. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నగర వాసులు అప్రమత్తంగా నగరంలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉన్నట్లుండి వాతావరణం చల్లబడి పలుప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. నగర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచే మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి అన్ని చోట్ల వర్షం పడటం తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్లలో నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. వర్షం ధాటికి చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి ఆ నీరంతా రోడ్డుపైకి రావడంతో డిజాస్టర్ట్ టీమ్స్ మోటార్లతో వర్షం నీటిని తొలిగిస్తున్నారు. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండలంటూ సూచించారు. ఈ ఏడాది వర్షాలు మోస్తరుగా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ అంచనాలకు మించి వానలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నతాధికారులే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు మోస్తరుగా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ అంచనాలకు మించి వానలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నతాధికారులే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.