కేసిఆర్ పాలనలో బీసీల ఆశలు అడియాసలు

-బూర్గుపల్లి కృష్ణయాదవ్ .ఎంఏ-

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2014 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే  బీసీ ఉప ప్రణాళిక ఏర్పాటు చేస్తామని,  స్థానిక సంస్థల ఎన్నికలలో తమిళనాడు రాష్ట్ర తరహాలో 68 శాతం రిజర్వేషన్లు  కల్పిస్తామని టిఆర్ఎస్ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో  హామీ ఇచ్చి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన  కెసిఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక19-08-2014 నాడు  ప్రభుత్వ ఉద్యోగులు మరియు వాలంటీర్ల తో కలిపి ,నాలుగు లక్షల మందితో  రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఒక రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే  నిర్వహించారు. కులము,మతము,వర్గం,వృత్తి ఆస్తి అంతస్తులతోపాటు, ఉద్యోగులు,నిరుద్యోగుల  వివరాలు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించారు. సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ప్రకారం  రాష్ట్రంలో బీసీల సంఖ్య 52 శాతం, తర్వాత 17 కులాలను బీసీ జాబితాలో చేర్చడం ద్వారా  60 శాతానికి పెరిగింది.  బీసీ ఉపప్రణాళిక ఏర్పాటు చేసి, జనాభా దామాషా ప్రకారం, బడ్జెట్ కేటాయించి  విద్యా ఉద్యోగ, ఉపాధి,ఆ ర్దిక, రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం  తమను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశించిన బీసీల ఆశలు అడియశలయ్యాయి. నేటికీ బీసీ ఉపప్రణాళిక హామీ అమలుకు నోచుకోలేదు.  గత ప్రభుత్వాలు బీసీలఅభివృద్ధిని వి స్మరించాయని, బీసీల సమగ్ర అభివృద్ధి కోసం, వారి పిల్లల ఉన్నత చదువుల కోసం ఎన్ని కోట్ల ఖర్చైనా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని 20-09-2016నాడు ముఖ్యమంత్రి తన ముఖ్య కార్యదర్శి సి నర్సింగరావు, భూపాల్ రెడ్డితో కలిసి  అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తో  ఏర్పాటుచేసిన సమావేశంలో చెప్పారుకానీ  ఇంకా అమలు పరుచక పోగా ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చే నిర్మాణాలకు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ, సకాలంలో ఫీజు రియంబర్మెంటు నిధులువిడుదల చేయకపోవడం వల్లవిద్యా సంస్థ ల యాజమాన్యంవిద్యార్థుల ను ఫీజ్ బకాయిలు చెల్లించాలని వత్తిడి పెడుతున్నారు.పై తరగతులకు వెళ్లే విద్యార్థుల కుబకాయిఫీజ్ చెల్లిస్తేనే టీసీ ఇస్తామనిసత్తాయిస్తున్నా రు, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రియంబర్మెంటు నిధులు  విడుదల చేయకపోవడం వల్ల నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించే స్తోమతలేక  ఉన్నత విద్యకు  దూరమై, కుటుంబానికి భారమైమనోవేదనకు గురవు కొందరు విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మరోపక్క  అద్దె భవనాలలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల లో సరైన మౌలిక వసతులు లేకవిద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటునారని తక్షణమే గురుకులాలకు సొంత భవనాల నిర్మించి    విద్యార్థులకు నాణ్యమైన భోజనం,విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించాలని. ఫీజు రియంబర్మెంట్  బకాయి నిధులను విడుదల చేసివిద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేలా సహకరించాలని   బీసీ దళపతి ఆర్ కృష్ణయ్య ఆయన బృందం,పలుమార్లు  సంబంధిత విద్యాశాఖ మంత్రి మరియు సంబంధితఅధికారుల   దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు . ముఖ్యమంత్రి గారికిఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోనికి లాక్కోవడంపైఉన్నశ్రద్ధబీసిగురుకులాలఅభివృద్ధిపై ఫీజు రియంబర్మెట్ బకాయి నిధులు విడుదల చేయడంపై పోవడం బీసీల అభివృద్ధిపై  ఆయనకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్న మెజార్టీ ప్రజలైన బీసీలకు కూడా బీసీ బందు ఏర్పాటు చేసి  రాష్ట్రంలోని ప్రతి బీసీ కుటుంబానికి 100రాయితీతో 10 లక్షల రూపాయలిచ్చి ఆదుకోవాలని స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 50% రిజర్వేషన్ల కేటాయించాలని   బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు,  రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నారు , ఉద్యమ సెగ తాకిన ముఖ్యమంత్రి గారు త్వరలోనే బీసీ బందు అమలు చేసి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటామని రెండు సంవత్సరాల క్రితం హామీ ఇచ్చారు

కానీ అమలు మరిచారు.  తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రభుత్వ రంగాలలో సామాజిక న్యాయం జరగడం లేదు.  సామాజిక న్యాయం జరగాలంటే పాలకులు చిత్తశుద్ధితో జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించి వారి ఉన్నతికి తోడ్పాటునందించాలి కానీ కేంద్రం ప్రభుత్వంతోపాటు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా  బీసీలకు జనాభా దామాషా పద్ధతిన బడ్జెట్ కేటాయించడం లేదు . అభివృద్ధి చేయడంలో  దేశానికి నేనే దిక్సూచి అని చెప్పే  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హాయంలో ప్రతి సంవత్సరం కేటాయించిన వార్షిక బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి రెండు నుండి మూడు శాతం దాటి  బడ్జెట్ కేటాయించడం లేదు వాటి వివరాలు,   (1)2014-15 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వార్షిక బడ్జెట్,1,00637,96 కోట్లు, బీసీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్2020కోట్లు,. (2) 2015-16  ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ లో115,689,19కోట్లు,  బీసీ సంక్షేమ రంగానికి కేటాయించిన బడ్జెట్ 2172 కోట్లు, (3) 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వార్షిక బడ్జెట్  130,415,87కోట్లు, బీసీ సంక్షేమ రంగానికి కేటాయించిన బడ్జెట్  2538కోట్లు (4) 2017-18

 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వార్షిక బడ్జెట్ 149,456 కోట్లు బీసీ సంక్షేమ రంగానికి కేటాయించిన బడ్జెట్  5070,36 కోట్లు,(5)2018-19 ఆర్థిక సంవత్సరంలో కేటాయించినవార్షికబడ్జెట్,174,453,,83కోట్లు బీసీ సంక్షేమ రంగానికి కేటాయించిన బడ్జెట్5920కోట్లు(6)2019-20 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన ఓ టాన్ అకౌంటు బడ్జెట్ 146,492,30 కోట్లు బీసీ సంక్షేమానికి2990,04కోట్లు కేటాయించారు.( 7) 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వార్షిక బడ్జెట్ 1,82,,914,42కోట్లు బీసీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్4356,38 కోట్లు (8) 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వార్షిక బడ్జెట్230,825,96 కోట్లు బీసీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్5522కోట్లు    (9) 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వార్షిక బడ్జెట్ 256,958 కోట్లు బీసీ సంక్షేమ రంగానికి కేటాయించిన బడ్జెట్5697కోట్లు (10) 2023-24. ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన  వార్షిక బడ్జెట్ 2,90,396లక్షల కోట్లు బీసీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ 6229కోట్లు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదిసార్లు కేటాయించిన ప్రతి వార్షిక బడ్జెట్ సంఖ్య పెరుగుతూ వచ్చింది కానీ బీసీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్లో పెద్దగా మార్పేమిరాక పోగా. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు. 2017 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ కు కేటాయి స్తున్న అరకొర బడ్జెట్ అంకెల గారేడే తప్పనిధులను ఖర్చు చేయడం లేదు,2015,-16,మరియు 2017-18, ఆర్థిక సంవత్సరాలలో బీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ల ద్వారా రాయితీ రుణాల కోసం  దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించడం వల్ల 5లక్షల 77 వేల మంది స్వయం ఉపాధి కోసం వ్యక్తిగత సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు ఆగమేఘాల మీద 2018లో  దాదాపు 30 వేల మందికి 50వేల రూపాయల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం 5లక్షల 47వేల మంది దరఖాస్తుదారులకు  మొండి చెయ్యి చూపింది, 2017 ఆర్థిక సంవత్సరం నుండి స్వయం ఉపాధి పై జీవించే వారికి  వ్యక్తిగత రాయితీ రుణాలను నిలిపివేసింది. బీసీలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ఉద్యమిస్తున్న బీసీలను విభజించి పాలించు అనే విధానంతో  కేవలం 15 బీసీ కులాలలో కుటుంబంలో ఒక్కరికి  100శాతం సబ్సిడీతో ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని  రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే  దాదాపు ఐదు లక్షలమంది కి కుపైగా  దరఖాస్తులు చేసుకున్నారు కానీ నేటికీ రాష్ట్రంలో 50 మందికి కూడా  లక్షరూపాయల ఆర్థిక సహాయం అందిన దాఖలాలు లేవు.ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఓట్ల కోసం వేసిన ఎరగానే మెజారిటీ బీసీలు భావిస్తున్నారు. లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించడం తోపాటు,  రాష్ట్రంలోని ప్రతి బీసీ కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని బీసీ దళపతి ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో   బీసీలు రాష్ట్ర వ్యాప్తంగాఆందోళనలు,నిరసన కార్యక్ర మాలుచేపడుతున్నారు.  జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన బడ్జెట్ రెండు  నుంచి మూడు శాతంకేటాయిస్తే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందా?  సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన బీసీల జనాభా లెక్కలు  రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. బీసీ జనాభా లెక్కల బహిరంగంగా ప్రకటించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పై ఒత్తిడి తేవాల్సిన  బీసీ సామాజిక వర్గానికి చెందినమంత్రులు,శాసనసభ్యులు ,ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులలో కొందరు ఖ్యమంత్రిబీసీ పక్షపాతి అని   బీసీల పాలిట మరో పూలే అని,  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కంటే గొప్పవాడని ప్రశంసిస్తున్న వారికి బడ్జెట్ కేటాయింపులోజరుగుతున్నఅన్యాయం  కంటికి కనిపించడంలేదా,,  అనిబీసీఉద్యమకారులు,మేధావులు,విద్యావంతులుప్రశ్నిస్తున్నారు. జనాభానిష్పత్తిప్రకారంబడ్జెట్కేటాయింపుతోపాటు, రాజకీయ, విద్యా,ఉద్యోగ,ఆర్దిక,ఉపాధి, సంక్షేమ,పారిశ్రామికరంగాలతో  పాటు నిర్ణయాధికారంలో  సమాన వాటా కోసం  నిరంతరం పోరాడుతున్నఉద్యమకారులకుఅండగాఉండాల్సినబాధ్యతమేధావులు,విద్యావంతులు,, నిరుద్యోగులు, కుల సంఘాల నాయకులపై ఉంది. అందరూ బాధ్యతాయుతంగా కలిసికట్టుగా ఏకతాటిపైనిలిచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలలో రాజకీయ చైతన్యం,అధికార కాంక్ష రగిలిస్తూ,  ఉద్యమంలో వారిని భాగస్వాములను చేసి   మరో స్వతంత్ర పోరాటం చేస్తేనే అన్ని ప్రభుత్వ,ప్రైవేటు రంగాలలో  బీసీలకు సామాజిక న్యాయం జరుగడం తోపాటు, రాజ్యాధికారం చేజి క్కుతుంది.

బూర్గుపల్లి కృష్ణయాదవ్ ( ఎంఏ)

బీసీసేన తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు

సెల్, no,9866170384

Leave A Reply

Your email address will not be published.