చీతాను ముద్దాడిన యువతి

.. అవాక్కు అవుతున్న నెటిజన్లు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ : అడవి మృగాలతో అప్రమత్తంగా ఉండాలి. క్రూరత్వం వాటిని ఒక్కోసారి ఎంతకైనా తెగించేలా చేస్తుంది. వన్యప్రాణులకు చిక్కి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది. అయినప్పటికీ.. అప్పుడప్పుడూ కొందరు రిస్క్ చేస్తుంటారు. వన్య ప్రాణులతో సెల్పీలు దిగడం, వాటికి దగ్గరగా తిరగడం వంటివి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె చేసిన పని వాళ్ల కళ్లను నమ్మనివ్వట్లేదు. సింహం, పులి, చిరుత, చీతా వంటి జంతువులు చాలా భయంకరంగా ఉంటాయి. నిజానికి వాటిని దగ్గర నుంచి చూడాలంటే కూడా ఎంతో భయంగా ఉంటుంది. భయంకరమైన జంతువులలో చీతా ఒకటి. ఒకవేళ కనక అది మన పక్కన ఉంటే దాని నుంచి బయటపడటం ఎంతో కష్టం. ఇటువంటి వాటిని ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సన్నగా ఉండే చీతాలు వేటాడి చంపడంలో దిట్టలు. అయితే చీతాలో సాఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. ఈ ఫోటో చూస్తే ఆ విషయం తెలుస్తుంది. ఒక అమ్మాయి చీతా పక్కనే వుంది. ఆమె ఆ చీతాకు ముద్దులిచ్చి మురిపించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన చాలా మంది యూజర్లు ఆమె చేసే పనిని చూసి అవాక్కవుతున్నారు. ఏంటి ఇంత భయంకరమైన జంతువుకి ఈమె ముద్దులిచ్చి ప్రేమగా చూసుకుంటోంది అని. ఆ చీతా కూడా ఆమెపై దాడి చెయ్యలేదు

Leave A Reply

Your email address will not be published.