సకల హంగులతో కోహెడ మార్కెట్

తెలంగాణ  జ్యోతి/వెబ్ న్యూస్: సకల హంగులతో కోహెడ మార్కెట్  రుపుదిద్దు కుంటున్నాడని, వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చ్జ్హేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తామన్నారు.48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం,కమీషన్ ఏజెంట్లు అందరికీ దుకాణాలు16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్56.54 ఎకరాల్లో రహదారులు11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుమార్కెట్ నిర్మాణ ప్రణాళిక ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకుని ప్రారంభిస్తాం మని చెప్పారు.
హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో కోహెడ పండ్లమార్కెట్ నిర్మాణంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కౌసర్ మొహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్ల బలాలా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఆర్డీడీఎం పద్మహర్ష, డీఎంఓ ఛాయాదేవి, మార్కెట్ కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.