నాలుగేళ్లు గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోయిన ముఖ్యమంత్రి..

- ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారు - వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.”దేశంలో ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం తర్వాత హామీలు నెరవేరిస్తే.. దొర గారికి మాత్రం ఎన్నికల ముందే హామీలు గుర్తుకొస్తాయి. నాలుగేళ్లు గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోయిన ముఖ్యమంత్రి.. ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రైతులను ఓట్లు అడిగే ముఖం లేక రుణమాఫీ చేస్తానని నక్క వినయం ప్రదర్శిస్తున్నారు. అమలు చేయడానికి కేసీఆర్ దగ్గర చిల్లిగవ్వ లేని పరిస్థితి. బీఆర్ఎస్ బంధిపోట్లకు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సొమ్మంతా దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయింది. ఇక మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్ లో చేయాల్సిన మద్యం టెండర్లను 3నెలల ముందే ముంగటేసుకున్నారు. జనాలకు మద్యం తాగిస్తాడట… వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తాడట. సిగ్గుందా ముఖ్యమంత్రి గారు? రేట్లు పెంచి, టాక్స్ పెంచి ప్రజల రక్తం తాగడం చాలదని.. మద్యం తాగించి, మహిళల మంగళసూత్రాలు తెంపి, జనాలను మద్యానికి బానిస చేసి ఓట్లు దండుకోవడమా?.” అని షర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.