రోడ్ విస్తరణ పనులు పరిశీలించిన  నగర పాలక సంస్థ మేయర్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:  కొర్లగుంట మారుతి నగర్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ అనుపమ అంజలి, అదనపు కమిషనర్ సునీత, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. కొర్లగుంట మారుతి నగర్ ప్రధాన రోడ్డు విస్తరణ జరుగుతున్న సందర్భంగా భవన యజమానులతో కాలినడకన భవన యజమానులతో మమేకమై త్వరితగతిన మెయిన్ రోడ్డు వైడనింగ్ చేయాలని సూచించారు. భవనములు తొలగించిన వెంటనే తిరుపతి నగరము నందు మోడల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. భవన యజమానులకు త్వరగా టీడీఆర్ బాండ్లు జారీ చేయవలసిందిగా టౌన్ ప్లానింగ్ వారిని ఆదేశించడం అయినది. ప్రధాన రహదారి విస్తరణ పనులు మోక్షం కలిగిందన్నారు. ప్రస్తుతం 17 అడుగుల వెడల్పు కలిగిన రహదారిని 40 అడుగులు వెడల్పు చేయడం జరుగుతుందని తెలియజేశారు. యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు ముందుకు రావడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేశారు. కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో కొర్లగుంట మాస్టర్ ప్లాన్ రోడ్డుకు,డ్రైన్ లకు ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. కమీషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డుపై దృష్టి పెట్టామని, మాస్టర్ ప్లాన్ రోడ్డు లు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందని తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో భవన యజమానులకు నగరపాలక సంస్థ టి.డి.ఆర్ బాండ్లు జారీచేయాలని ప్రాణంగా అధికారులు ఆదేశించారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ మాట్లాడుతూ కొర్లగుంట ప్రధాన రహదారి విస్తరణ పనులు మోక్షం కలిగింది అని. నగరపాలక పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వారి బృందం విస్తరణ పనులు ప్రారంభం జరిగిందని. గతంలో రోడ్డులో ఆక్రమణయని వాటి తొలగించుకొని కోరి ఉన్నాము. గతంలో కొర్లగుంట మారుతి నగర్ మెయిన్ రోడ్డు నందు ఆటోలు, ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం నలుగురికి వెడల్పు చేయడం జరిగిందని తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్డు పరిశీలించిన వారిలో మేయర్ డాక్టర్ శిరీష వారితో పాటు కమీషనర్ అనుపమ అంజలి,ఉప మేయర్ భూమన అభినయ్, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి, అదనపు కమిషనర్ సునీత,యస్.ఈ. మోహన్, కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి, ౮వ వార్డు అధ్యక్షులు మురళి, గంగమ్మ గుడి బోర్డు సభ్యులు వెంకటేశ్వరావ్ రాయల్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం, సర్వేయరులు దేవానంద్, మురళీకృష్ణ, ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.