ఎన్ సి డి కిట్ల పంపిణీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శాసన సభాపతి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో శనివారం జరిగిన ఎన్ సి డి కిట్ల పంపిణీ ప్రారంభోత్సవంలో ఈసందర్భంగా పోచారం గారు మాట్లాడుతూ వయస్సు పెరిగిన తరువాత కొంతమందికి సహజంగానే బిపి షుగర్ జబ్బులు వస్తాయి. కామారెడ్డి జిల్లాలో షుగర్ వ్యాధి ఉన్న వారు 41,058 మంది, BP ఉన్నవారు 21,217 మందిగా సర్వేలో నమోదైంది అన్నారు. ఈ రెండు జబ్బులు ఉన్నవారికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా మందులు అందిస్తారని, ఆశా కార్యకర్తలు ప్రతి నెలా ఈ మందులను మీ ఇంటి దగ్గరే అందిస్తారాని తెలిపారు. అవసరమైన వారికి పరీక్షలు కూడా చేయిస్తారు. మందులను సక్రమంగా వాడి BP, షుగర్ అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే పెద్ద జబ్బులకు దారితీస్తాయ అన్నారు. జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని, శారీరక శ్రమ, వ్యాయామం చేయడం ద్వారా చక్కెర వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు, జబ్బులు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. అనంతరం బాన్సువాడ మాత శిశు ఆసుపత్రి ప్రారంభించి సంవత్సరం అయిన సందర్భంగా స్పీకర్ పోచారం గారు పిల్లల వార్డులో పండ్ల ను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో  శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్, ఆర్డీఓ రాజా గౌడ్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.