సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఇండియా కూటమి పక్షాలకు లేదు

- నిన్న రాజ్యసభలో సెమీ ఫైనల్స్‌లో ఇండియా కూటమి పరాజయం  -  విపక్ష కూటమి ఇండియా పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విపక్ష కూటమి ఇండియా పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇండియా కూటమిపై మోదీ విరుచుకుపడ్డారు. ఇండియానుంచి కుటుంబ పాలనకుఅవినీతికిఅవకాశవాద రాజకీయాలకు ముక్తి లభించాలన్నారు. నిన్న రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల కూటమికి సెమీ ఫైనల్స్ అని.. సెమీస్‌లోనే ఇండియా కూటమి ఓడిపోయిందన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఇండియా కూటమి పక్షాలకు లేదని మోదీ అన్నారు. సామాజిక న్యాయానికి ఇండియా కూటమి పార్టీల వల్లే నష్టం జరిగిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఇండియా కూటమి పరాజయం పాలైందని మోదీ అన్నారు.2024 ఓటింగ్‌కు ముందు సెమీఫైనల్ అని కొందరు అహంకారంతో అన్నారన్నారు. సెమీఫైనల్‌లో విజయం సాధించినందుకు ఎన్డీఏ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్ట్ 9 నుంచి బీజేపీ మరో క్విట్ ఇండియా నినాదం ప్రారంభమవుతుందన్నారు. ఆగస్టు 14న విభజన దినాన్ని జరుపుకుందామని మోదీ అన్నారు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పూర్తికాగానే ప్రతి గ్రామం నుంచి అమృత కలశ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఇందులో ఉందన్నారు. ప్రతి ఇంటిని సందర్శించిఆ ఇంటి పెద్దకు ఈ ప్రణాళికను ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటాలన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం తహసిల్జిల్లారాష్ట్ర స్థాయిని దాటుకుని ఢిల్లీకి చేరుకుంటుందని మోదీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.