పేద బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు నిరంతర ఉద్యమ స్ఫూర్తి గద్దర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నటికీ మరువలేని విప్లవ కళాకారుడు ప్రజా గాయకుడు విప్లవ కవి స్వర్గీయ గద్దర్ అని ఇంటర్నేషనల్ భీం సేన ఫౌండేషన్ మరియు  ఇంటర్నేషనల్ దాసన్న ఫౌండేషన్ చేర్మెన్ ఆర్చ్ బిషప్ దాసన్న కొనియాడారు.ఆయన మరణం యావత్ ప్రపంచానికి తీరని లోటని ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు.తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు,  నిస్వార్ధంగా ప్రజాసేవకై అంకితమైన ఎంతోమంది యువతకు కళాకారులకు స్ఫూర్తినిచ్చి తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు.పేద బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు నిరంతర ఉద్యమ స్ఫూర్తి గద్దర్ అని , తాడిత పీడిత వర్గాల అబ్యున్నతి కోసం పెత్తం దారి వర్గాల దోపిడీ అరాచకాలను ఎదిరించి తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన మహోన్నతుడు గద్దర్ అని కొని యాడారు. ఆయన మరణం  పేద బడుగు బలహీన వర్గాల కు తీరని లోటని పేర్కొన్నారు.ప్రజా ఉద్యమాలకు పాటతో ఊపిరి పోశారని, గద్దర్ మృతితో ప్రశ్నించే గొంతు మూగబోయిందని అన్నారు. పౌరహక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువలేనిది’’.  తెలంగాణ ఉద్యమ గళం గద్దర్‌’’ అన్నారు.బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్. గద్దర్ పాటలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయన్నారు. ‘‘ నీ గానం… తెలంగాణ వేదం. నీ గజ్జె… తెలంగాణ గర్జన. నీ గొంగడి… తెలంగాణ నడవడి. నీ గొంతుక… తెలంగాణ ధిక్కార స్వరం. నీ రూపం… తెలంగాణ స్వరూపం. గద్దరన్నా… నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం. నీ మరణం… నా గుండెకు శాశ్వత గాయ మన్నారు.. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు.  ‘‘ ఒక అన్నమయ్య పుట్టారు..దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు… దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు… దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు… దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’’ ఐనా ఆయన ఆట పాటలు ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలుస్తాయన్నారు.ఆయన  ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.