ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు అవకాశం

-   మంత్రి పువ్వాడను జాతీయ బీసీ సంక్షేమ సంఘం వినతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బి సి సంఘ నాయకులు కలిసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానం జనరల్ ఉండగా కనీసం ఉమ్మడి జిల్లా లో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడుతూ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు జిల్లాలో కనీస ప్రాధాన్యత లేకపోవడం దురదృష్టకరమని ఈసారి ఏ రాజకీయ పార్టీ అయితే ఎక్కువ సీట్లు బీసీల కేటాయిస్తుందో వారి వెంట బీసీలు నడుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన  పుల్లారావు మహిళ విభాగం జల్లా అధ్యక్షురాలు శ్రీమతి సుగుణ , జిల్లా కార్యదర్శి గుడిదా రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు సత్తుపల్లి మండల అధ్యక్షులు పామర్తి నాగేశ్వరరావు పంతంగి వెంకటేశ్వరావు, సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.