12 న  నర్సింగ్ విద్యార్థులు..అవకాశాలు ..సవాళ్లు”  అనే అంశం పై సదస్సు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ట్రైనుడు నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు స్టూడెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి 3 వ    ద్వై వార్షిక రాష్ట్ర సదస్సు ఆగస్టు 12 న  తెలంగాణ రాష్ట్రము ఆధ్వర్యంలో”నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రెస్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ మెంబర్ లిల్లీ మేరి తెలిపారు.ఈ మేరకు సిద్దిపేటలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.నర్సింగ్ విద్యార్థులను శక్తివంతం  చేయడం.. అవకాశాలు మరియు  సవాళ్లు”  అనే అంశం పై రైలు కళారంగ్,  బోయ గోడ,  సికింద్రాబాద్ యందు రాష్ట్ర సదస్సు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు.  ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ,  రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్,  డిప్యూటీ స్పీకర్ పద్మారావు,  మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ట్రైనుడు నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,   సౌత్ రీజియన్,  వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జైనీ కెంపు,  డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ ప్రొఫెసర్ విద్యుల్లత,  తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ మిడ్ వైఫరీ కౌన్సిల్ రిజిస్టార్ విద్యావతి తదితరులు పాల్గొంటారని ఆర్గనైజర్స్ రాష్ట్ర అధ్యక్షులు, ట్రైనుడు నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేశ్వరి,  సెక్రటరీ స్వరాజ్యవాణి సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రెస్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ మెంబర్ లిల్లీ మేరి  ఒక ప్రకటనలో తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.