పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన కృష్ణ స్వామి ముదిరాజ్

- హోం మంత్రికి జయంతి వేడుకలకు ఆహ్వాన పత్రికను అందించిన పుట్టి యాదగిరి ముదిరాజ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ మాజీ మేయర్ స్వర్గీయ కృష్ణస్వామి ముదిరాజ్ 130వ జయంతి పురస్కరించుకొని ఆగస్టు 25న జరిగే స్వర్గీయ కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా పాల్గొనాలని తెలంగాణ ముదిరాజు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి యాదగిరి ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేశం తో కలిసి కార్యవర్గం సబ్యులు  కలిసి సెక్రటేరియట్లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ లను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా పుట్టి యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ కృష్ణ స్వామి ముదిరాజ్ నగర పాలకుడిగా పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని సమాజసేవ దృక్పథంతో మతసామరస్య సంస్థలను స్థాపించి ప్రజాచరణ పొందాలని అన్నారు. ఈ జయంతి వేడుకలలు ఎస్.కె సత్య కమల ఫంక్షన్ హాల్ గోవింద్ నగర్ అంబర్పేట్ నందు ఘనంగా నిర్వహించే ఈ జయంతి వేడుకలకు నగరంలోని ముదిరాజ్ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం  చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు చింతల నవీన్ ముదిరాజ్, యం. సతీష్ ముదిరాజ్, డప్పు అంజయ్య ముదిరాజ్, తూర్పు రామచందర్ ముదిరాజ్, కొరివి లక్ష్మణ్ ముదిరాజ్, వి బాలరాజు ముదిరాజ్, చింతల సత్యనారాయణ ముదిరాజ్, నగర అధ్యక్షుడు మహేష్ ముదిరాజ్, మోర శ్రీరాములు ముదిరాజ్, అనంతయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.