పేదలకు న్యాయం జరిగేలా బాధ్యతగా వీఆర్‌ఏలు పనిచేయాలి

: మంత్రి గంగుల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  పేదలకు న్యాయం జరిగేలా బాధ్యతగా వీఆర్‌ఏలు పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 442 మంది విఆర్ఏలకు వివిధ శాఖల యందు ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక ఉత్తర్వుల పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖలకు కేటాయించిన గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ) పేదలకు న్యాయం జరిగేలా బాద్యతయుతంగా విధులను నిర్వర్తించాలని సూచించారు.నిన్నటి వరకు జిల్లాలోని గ్రామాల్లో గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ) గా విధులు నిర్వహించిన 442 మంది విఆర్ఏ లను ప్రభుత్వ పేస్కేల్‌ ఉద్యోగులు నియమిస్తూ సీఎం కేసీఆర్‌ చారిత్మాత్మక నిర్ణయం తీసుకొని వీఆర్‌ఏల గౌరవం పెంచారన్నారు. అలాగే పంచాయతీకార్యదర్శులుగా 4 సంవత్సరాల సర్వీసు కాలం పూర్తిచేసుకున్న వారికి క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అందజేశారు.కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటంతట అవే వస్తాయని, గతంలో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అంకిత భావంతో పనిచేసిన వీఆర్ఏలు అదే తరహాలో కేటాయించిన శాఖలలో విధులు నిర్వహించాలని కోరారు. కష్టపడి పనిచేసి భవిష్యత్తులో పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.