స్వతంత్ర దినోత్సవ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు  కోవూరి మొగులయ్య గౌడ్  సతీమణికోవూరి మణమ్మ  గారికి  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్  స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు 15ను పునస్కరించుకొని ఘనంగా శాలువాతో పూలగుచ్చంతో సన్మానించారు.ఈ సందర్భంగా  స్వతంత్ర సమరయోధుడు సతీమణి కోవూరి మణమ్మ మాట్లాడుతూ  స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే  మనం జరుపుకునే  స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 అని కొనియాదారు.  అట్టి స్వాతంత్రానికి భంగం కలగకుండా  స్వతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు  తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం  కృషి చేయాలని  కోరారు. అట్టి ఆశయాలను నెరవేర్చుటకు  తన భర్త అయిన స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్య గౌడ్  సదాశివపేట పట్టణంలో సిద్దాపురం గ్రామం 267 సర్వే  నంబర్లో  కేటాయించిన పది ఎకరాల  పట్టాసర్టిఫికెట్ ను  వెంటనే ధరణిలో చేర్చి  స్వతంత్ర సమరయోధుడు  కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్  కు సహకరించి  స్వతంత్ర సమరయోధులు కన్న కలలను నెరవేర్చుటకు ముందుండి  తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు కొనసాగుతున్న స్వతంత్ర సమరయోధుడు  కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్  చేపట్టే కార్యక్రమాలకు ,స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కోసం నిర్మించే  ఫ్రీడమ్ ఫైటర్స్ పిరమిడ్ క్షేత్రాన్నికి  రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

ఒకవైపు స్వాతంత్ర సమరయోధుడు విలువలు తెలిసిన  మంత్రి హరీష్ రావు,  ఎమ్మెల్సీ కవిత గారు  స్వతంత్ర సమరయోధుడు ఆశయాలను నెరవేర్చుటకు  అతనికి  సదాశివపేట పట్టణం, సిద్దాపురం గ్రామం 267 సర్వే నంబర్ లో కేటాయించిన పరికరాల భూమిని ధరణిలో చేర్చి  స్వాతంత్ర సమరయోధుడు కోవూరి  మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చేదిద్దే విధంగా  ముందుకెళ్తున్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు కోవూరి  మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు  ప్రభుత్వ యంత్రాంగం సంపూర్ణ మద్దతుతో మెదలాలని  కొనియాడగా  ఇట్టి పనుల్లో  అనగా స్వతంత్ర సమరయోధుడు ఆశయాలకు సహకరించే విషయంలో  సంపూర్ణంగా సంగారెడ్డి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ  అధ్యక్షులు  మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విఫలమయ్యారని  అతని అవివేకం వల్ల  సంగారెడ్డి జిల్లాలో బి.ఆర్.ఎస్ పార్టీ ఓటమి ఖాయమని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ తనయుడు  జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర  ప్రధానకార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర  కార్యదర్శి పులి సంగప్ప గౌడ్,  కరాటే మాస్టర్ అశోక్,  న్యాయవాది వైభగవంతరావు, టీఎస్ లాన్యూస్ ఛానల్ స్టేట్  ఇంచార్జ్  జి.రమేష్ గౌడ్,  పులి సాయి కిరణ్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు  కోవూరి అనిల్ కుమార్ గౌడ్, సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం నాయకులు జి.శంకర్ గౌడ్,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ నెంబర్స్,  పోలీసు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.