9 ఏళ్ల కాలంలో పన్నుల రూపంలోప్రజలు  కట్టింది 20 లక్షల కోట్లు

-  డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 11వేల కోట్లు - హడ్కో సంస్థలో 8600 కోట్ల అప్పు తెచ్చింది. 1311 కోట్లు కేంద్రప్రభుత్వం ఇచ్చింది.    -  బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మెదక్ గడ్డ నుంచే యుద్ధం మొదలయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం నాడు ఈటెల మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణరాష్ట్రం గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పై అసెంబ్లీలో దాడి చేశారు. 9 ఏళ్ల కాలంలో పన్నుల రూపంలో కట్టింది 20 లక్షల కోట్లు. 20 లక్షల కోట్లలో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఇచ్చింది ఎంత.?ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 11వేల కోట్లు ఖర్చు చేసింది. అందులో హడ్కో సంస్థలో 8600 కోట్ల అప్పు తెచ్చింది. 1311 కోట్లు కేంద్రప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వంకేవలం 500 కోట్లు ఇచ్చింది.శాసనసభలో డబుల్ బెడ్రూం ఇల్లు, నిరుద్యోగ భృతిపై చర్చ జరగాలి. గ్రామాల్లో చదువుకున్న యువకులకు పిల్ల దొరకడం లేదు. ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా 3.50 కోట్ల ఇళ్లు కట్టిండ్రు. పక్క రాష్ట్రం 20 లక్షల ఇళ్లు కట్టిండ్రు.గృహలక్ష్మీకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. టీఆర్ఎస్ నేతలకు ఇవ్వొద్దు. దేశంలో నెంబర్ వన్ లిక్కర్ స్టేట్ తెలంగాణ. ఇప్పుడు 45 వేల కోట్లు లిక్కర్ ఆదాయం. తెలంగాణ సీఎం కేసీఆర్భూములమ్మి రాష్ట్రాన్ని నడుపుతున్నారు.నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టుకు రైతులు పోతే డబ్బులు ఇవ్వమని సుప్రీంకోర్టుకు పోయారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వానికి ప్రేమ లేదు. నోటిఫికేషన్లు ఇస్తే లీకేజీ చేస్తారు. 17 పేపర్లు లీకేజీ అయ్యాయి. చదువుకున్నోళ్లకు ఉద్యోగం రావడం లేదు..పైరవీలకే ఉద్యోగాలు వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ లో అన్ని అక్రమాలే’’ అని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.