ఇకపై ఆరేళ్ళు వచ్చిన పిల్లలను మాత్రమే ఒకటో తరగతిలో చేర్చుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఇకపై ఆరేళ్ళు వచ్చిన పిల్లలను మాత్రమే ఒకటో తరగతిలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టుధర్మాసనం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5.5 ఏళ్ళ విద్యార్థులను ఒకటవ తరగతిలో చేర్చుకుంటున్నారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఆరేళ్ళ అయిన వారిని మాత్రమే చేర్చుకోవాల్సి ఉంటుంది. 2022 విద్యాసంవత్సరం నుంచే ఆరేళ్ళ చిన్నారులను మాత్రమే బడుల్లో చేర్చుకునేలా ప్రభుత్వం నిర్ణయించింది. 2022 జూలై26న ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. అదే విద్యాసంవత్సరం నుంచే అమలులోకి వస్తుందని అందరూ భావించారు. కానీ అనికేత్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడంతో వాయిదా పడింది. విచారణ జరిపిన న్యాయమూర్తి సచిన్‌ శంకర్‌ మగదుం తుది తీర్పును ప్రకటించారు. జాతీయ విద్యావిధానంలోను వయసు సడలించి తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఆరేళ్ళ చిన్నారులను ప్రభుత్వ, ప్రైవేటు, అనుధాన, అనుధానరహిత విద్యాసంస్థలలో చేర్చుకునేలా తీర్పును ప్రకటించారు. అనికేత్‌ పిటీషన్‌ను కొట్టివేశారు. విశ్వవ్యాప్తంగా విద్యావిధానానికి అనుగుణంగా జాతీయ విద్యావిధానంలో నిబంధనలు పొందుపరచారని అలా కాకుండా భిన్నమైన విధానాలు పాటిస్తే విద్యార్థి ఒకే తరగతిని రెండేళ్ళు చదవాల్సి ఉంటుందని ప్రస్తావించిన ధర్మాసనం పిటీషన్‌ను కొట్టివేసింది.

Leave A Reply

Your email address will not be published.