హైదరాబాదులో డిజిటల్ హవాలా స్కాం..

-    దందాను చూసి సైబర్ క్రైం పోలీసుల షాక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగరంలోని పలు ఆన్‌లైన్ సెంటర్లపై సైబర్ క్రైం పోలీసులుదాడులు చేశారు. ఈ దాడుల్లో డిజిటల్ హవాలా స్కాంవెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీని నకిలీ టెలికాలర్స్లోకల్ బిట్ కాయిన్స్‌గా మార్చి వచ్చిన డబ్బును డిజిటల్ హవాలా రూపంలో తిరిగి పంపుతున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్(పరిధిలో నకిలీ అమెరికన్ కాల్ సెంటర్‌పై దాడి చేసి 115 మందిని పోలీసులు అరెస్టు చేశారు.అమెరికా, కెనడా దేశాలకు చెందిన వ్యక్తుల డాటను నేరస్తులు ఆన్‌లైన్లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఏకంగా అమెజాన్ నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఈవ్యవహారానంతటిని నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులను పోలీసులు అదుపులోకి విచారణ చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.